NTV Telugu Site icon

AP Group-2 Mains: ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా.. కారణమిదే..?

Gropu 2

Gropu 2

ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ (APPSC ) ప్రకటన చేసింది. జులై 28వ తేదీన నిర్వహించే గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. వీరందరి అభ్యర్థన దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని పలువురు కోరారు. ఈ క్రమంలో.. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేశారు. తదుపరి పరీక్షా తేదీని త్వరలో తెలుపుతామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. జూలై 28న నిర్వహించాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను రెండు నెలల పాటు వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువజన జేఏసీ, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనేక మంది అభ్యర్థులు ఎన్నికల విధుల్లో ఉన్నారని, మరికొందరు ఎన్నికల ప్రక్రియలో బిజీగా ఉంటూ పరీక్షలకు ప్రిపేర్ కాలేకపోయారని తెలిపారు.

Read Also: Hathras Stampede: “సంఘ వ్యతిరేక శక్తుల” వల్లే తొక్కిసలాట.. భోలే బాబా ప్రకటన..

ఇదిలా ఉంటే.. టెట్, మెగా డీఎస్సీ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కొత్త తేదీలను ప్రకటించనుంది. కాగా.. టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకు సన్నద్దమయ్యేందుకు మరింత సమయం కావాలని అభ్యర్థులు మంత్రి నారా లోకేష్‌ను కలిసి కోరారు. ఈ క్రమంలో.. టెట్‌, మెగా డీఎస్సీ సన్నద్ధతకు సమయమిచ్చే అంశంపై విద్యా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్‌ సమీక్ష నిర్వహించారు. అభ్యర్థుల వినతిని పరిగణనలోకి తీసుకున్న మంత్రి లోకేష్‌.. టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధతకు మరింత సమయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెట్ పరీక్ష నిర్వహణకు 90 రోజులు, మెగా డీఎస్సీ నిర్వహణ కు 90 రోజుల సమయమివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే టెట్, డీఎస్సీ నిర్వహణకు ఏపీ ప్రభుత్వం కొత్త తేదీలను ప్రకటించనుంది.

Read Also: Kollu Ravindra: ఇసుక కొరత లేకుండా చూస్తాం.. బ్లాక్ మార్కెట్ చేయాలని చూస్తే కఠిన చర్యలు