Vallabhaneni Vamshi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అక్రమాలపై సిట్ ఏర్పాటు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన చేసిన భూ అక్రమాలు, అక్రమ మైనింగ్, ఆర్థిక అరాచకాలపై దర్యాప్తు చేయాలని సిట్ కు సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. నలుగురు పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెట్ కి సీనియర్ ఐఏఎస్ అధికారి జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వం వహించనున్నారు.
Read Also: Health Benefits of Dates: ప్రతిరోజూ ఖర్జూరాలు తింటే.. ఈ వ్యాధులు రమ్మన్నా రావు!
ఇక, గత ప్రభుత్వం అండగా వల్లభనేని వంశీ చేసిన అక్రమాలు, అక్రమ మైనింగ్ సహా భూకబ్జాలపై ఈ సెట్ విచారణ చేయనుంది. సుమారు 100 కోట్ల రూపాయలు దోపిడీ చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆంధ్ర ప్రభుత్వం ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
