Site icon NTV Telugu

AP Govt: తెలంగాణ ఉద్యోగులను సొంత రాష్ట్రానికి పంపిన ఏపీ సర్కార్..

Ap Govt

Ap Govt

AP Govt: తెలంగాణ రాష్ట్రానికి చెందిన 58 మంది క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులను వారి సొంత రాష్ట్రానికి పంపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి వచ్చిన 698 మందిని.. గతంలో తెలంగాణకు పంపింది. సరైన అవగాహన లేక కొందరు, కారుణ్య నియామకంతో మరి కొందరు.. తెలంగాణ ఆప్షన్ ను 58 మంది ఉద్యోగులు పెట్టుకున్నారు. తమను కూడా తెలంగాణకు పంపాలని వీరు కోరారు. తెలంగాణ ప్రభుత్వం విధించిన కొన్ని షరతులతో తిరిగి వారిని సొంత రాష్ట్రానికి ఏపీ సర్కార్ పంపుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

Exit mobile version