Site icon NTV Telugu

AP New Mandals:ఏపీలో కొత్తగా ఆరుమండలాల ఏర్పాటుకి నోటిఫికేషన్

ఏపీలో కొత్తగా ఆరు మండలాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం ఆరు జిల్లాల్లోని జిల్లా కేంద్రం ఉన్న మండలాలను రెండేసి మండలాలుగా విడదీస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. విజయనగరం, చిత్తూరు, నంద్యాల, అనంతపురం, ఒంగోలులను అర్బన్ , రూరల్ మండలాలుగా విభజిస్తూ నోటిఫికేషన్ జారీ అయింది.

Read Also: February Temperature: 1877 తర్వాత ఈ ఫిబ్రవరిలోనే ఎండలు అధికం..

మచిలీపట్నం మండలాన్ని మచిలీపట్నం సౌత్, నార్త్ మండలాలుగా విడదీస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. మచిలీపట్నం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 1-19, 40 వార్డులు సహా 18 గ్రామాలను మచిలీపట్నం నార్త్ మండలంగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. బందరు రూరల్ గ్రామం సహా 12 గ్రామాలు, మచిలీపట్నం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 20-39 వార్డులను మచిలీపట్నం సౌత్ మండలంగా నిర్ధారిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది రెవెన్యూ శాఖ.మండలాల విభజనకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్లో ఏవైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది. నోటిఫికేషన్లోని అభ్యంతరాలను, సలహాలు, సూచనల్ని 30 రోజుల్లోగా స్థానిక జిల్లా కలెక్టర్ కు తెలియ చేయాల్సిందిగా కోరింది ప్రభుత్వం.

Read Also: Pattabhi Bail Petition:టీడీపీ నేత పట్టాభి బెయిల్ పిటిషన్ పై వాదనలు

Exit mobile version