NTV Telugu Site icon

Employee Transfer: ఏపీవ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలు.. పైరవీలు చేస్తే కఠిన చర్యలు: సర్కార్

Ap Employees

Ap Employees

Employee Transfer: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలపై కసరత్తు కొనసాగుతుంది. విద్య, వైద్య శాఖలు మినహా 15శాఖల్లో బదిలీలు కొనసాగనున్నాయి. పైరవీలు, అవినీతికి ఆస్కారం లేకుండా బదిలీలు చేపట్టాలని మంత్రులు, ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి పైరవీలతో బదిలీలు చేపడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. ఇక, ఆఫీస్ బేరర్ల లెటర్లపై స్క్రూటినీ తర్వాతే బదిలీలకు వెసలుబాటు కల్పించారు. ఒకే దగ్గర ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు తప్పనిసరి బదిలీలు చేయనున్నారు. ఈనెల 31లోగా పూర్తి కానున్న బదిలీల ప్రక్రియ.. దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు, భార్యభర్తలకు వెసలుబాటు కల్పించారు.

Read Also: Heavy Vehicles: ఉదయం 7 గంటల తర్వాత సిటీలోకి భారీ వాహనాలు నో ఎంట్రీ..

అలాగే, వచ్చే నెల 5 నుంచి 15 వరకు ఎక్సైజ్ శాఖలో బదిలీలు చేపట్టనున్నారు. ప్రభుత్వంలోని కొన్ని శాఖలకు బదిలీలు వర్తింప చేయకపోవటంపై ఆక్షేపణలు వస్తున్నాయి. స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్, ఏపీ జీఎల్ఐ, పీఏఓ, ట్రెజరీస్ విభాగంలో బదిలీలు వర్తించవు.. ఈ విభాగాల్లో గడచిన 10-15 ఏళ్లుగా ఉద్యోగులు ఒకే చోట పని చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. బదిలీల జీవోలను ఈ విభాగాలకు కూడా వర్తింప చేయాలని ఉద్యోగుల నుంచి డిమాండ్ వస్తుంది.