NTV Telugu Site icon

R 5 zone: ఆర్ 5 జోన్ విషయంలో ముందడుగు.. గెజిట్ జారీ చేసిన ఏపీ సర్కార్

R 5 Zone

R 5 Zone

R 5 zone: రాజధానిలో ఆర్-5 జోన్ విషయంలో ముందడుగు వేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఆర్-5 జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ చేసింది సర్కార్.. 900 ఎకరాల భూముల్ని ఆర్-5 జోన్ పరిధిలోకి తెచ్చారు.. అమరావతిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం గెజిట్​ నోటిఫికేసన్​ విడుదల చేసింది. విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రత్యేక జోన్‌ ఏర్పాటు చేసింది. ఆ ఎంపిక చేసిన భూముల ప్రాంతాన్ని ఆర్‌-5 జోన్‌గా పేర్కొంటూ గెజిట్​ నోటిఫికేషన్​ జారీ చేసింది.

Read Also: Manchu Manoj: మంచు మనోజ్ నోట ఆ మాట.. మౌనిక ఎమోషనల్‌..

మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల పరిధిలోని భూములకు నోటిఫికేషన్ చేశారు.. తూళ్లురు మండలం మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలో గ్రామాల పరిధిలోని భూములకు నోటిఫికేషన్ ఇచ్చారు.. మొత్తంగా 900 ఎకరాల భూములకు నోటిఫికేషన్ ఇచ్చారు.. కాగా, ఆర్-5 జోన్ ఏర్పాటుపై 2022 అక్టోబరులో ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. దీని వల్ల రాజధాని అమరావతి ప్రాంతంలోని వారికే కాకుండా… ఇతర ప్రాంతాల వారికి కూడా ఇక్కడే ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు అవకాశం లభిస్తుంది. ఈమేరకు రాజధాని మాస్టర్ ప్లాన్‌లో మార్పులు, చేర్పులు చేసేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో న్యాయ పోరాటం చేశారు రైతులు.. ప్రభుత్వ తాజా నిర్ణయంపై వారు ఎలా స్పందిస్తారు అనేది వేచిచూడాల్సిన విషయం.

Show comments