NTV Telugu Site icon

ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ వాసులకు శుభవార్త..!

AP Govt

ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తున్న తెలంగాణ ప్రాంతవాసులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఏపీ ప్రభుత్వం.. తెలంగాణ నేటివిటీ ఉన్న ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకోవాలని సూచించింది.. స్పౌజ్ కేసుల విషయంలోనూ ఆప్షన్లు తీసుకోనుంది సర్కార్.. తెలంగాణ తరహాలోనే ఏపీ కూడా ఆప్షన్లు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది.. తెలంగాణ స్థానికత.. స్పౌజ్ కేసులకు సంబంధించి సుమారు 2 వేల మంది ఉద్యోగులు ఉంటారని అంచనా వేస్తోంది ఏపీ సర్కార్.. దీంతో.. సొంత ప్రాంతానికి వెళ్లాలని చూస్తున్న ఉద్యోగులకు ఊరట దక్కనుంది. ఇక, దీనిపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో పని చేస్తున్న తెలంగాణ స్థానికుల నుంచి ఆప్షన్లను తీసుకునే అంశాన్ని పరిశీలించాలని సీఎం వైఎస్‌ జగన్‌ను కోరామని.. సీఎం సానుకూలంగా స్పందించారని.. త్వరలోనే ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేయనుంది అని వెల్లడించారు.