Site icon NTV Telugu

Andhra Pradesh: కాంట్రాక్టు లెక్చరర్లకు ప్రభుత్వం గుడ్‌న్యూస్

Contract Lecturers

Contract Lecturers

కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలోని రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్(APREI) సొసైటీ రెసిడెన్షియల్ జూనియర్, డిగ్రీ కాలేజీల్లోని కాంట్రాక్టు లెక్చరర్ల జీతాలను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీరికి రివైజ్డ్ పేస్కేల్ ప్రకారం మినిమం టైమ్‌స్కేల్‌ను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీవో నెం.40 వర్తింపజేస్తూ సొసైటీ కార్యదర్శి ఆర్ నరసింహరావు మెమో జారీ చేశారు. ఈ పెంపు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

Movie Tickets In AP: సినిమా టికెట్ల ధరపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

కాగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద జీతాలు పొందుతున్న ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులను విద్యాశాఖలో విలీనం చేయాలని ఏపీ ఉపాధ్యాయుల సంఘాల సమన్వయ వేదిక అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, ఎయిడెడ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.త్రివిక్రమ్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వంలో విలీనమైన ఎయిడెడ్ అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి 010 పద్దు కింద జీతాలు చెల్లించేలా పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇవ్వడంపై పలువురు అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.

Exit mobile version