NTV Telugu Site icon

స్థానిక నేతలు చెప్పినా రాజీనామా.. సోము వీర్రాజుకు శ్రీకాంత్‌ రెడ్డి సవాల్

బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు సవాల్‌ విసిరారు ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి… కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సోము వీర్రాజు ఆరోపణలపై స్పందించారు.. విభజన చట్టంలో స్పెషల్ స్టేటస్, పోర్టు వంటి హామీలు అమలు చేస్తే మద్దతు ఇస్తామన్న ఆయన.. కానీ, సోము వీర్రాజు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. బీజేపీ విభజన హామీలు అమలు చేయలేదని అర్థమైందని ఎద్దేవా చేసిన శ్రీకాంత్‌ రెడ్డి.. తాను ఇసుక వ్యాపారం చేస్తున్నానని సోము వీర్రాజు అంటున్నారు… ఈ ఆరోపణలు నిజమని స్థానిక బీజేపీ నేతలు చెప్పినా రాజీనామా చేస్తానంటూ సవాల్‌ చేశారు.. మరి, సోము వీర్రాజు అందుకు సిద్ధమా…? అని ప్రశ్నించారు.

మరోవైపు బీజేపీ నేతలు ఎదురు దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు శ్రీకాంత్‌ రెడ్డి… పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా.. యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. ఇక, పోలవరం ఆర్ఆర్ ప్యాకేజీ కేంద్రం బాధ్యత కాదా? అని నిలదీసిన శ్రీకాంత్‌ రెడ్డి.. సమస్యలపై బీజేపీ అభ్యర్థులు బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ మరో సవాల్‌ విసిరారు.. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీల అమలుకు బీజేపీ నేతలు ప్రయత్నించాలని సూచించారు ప్రభుత్వ చీఫ్ విఫ్ శ్రీకాంత్‌ రెడ్డి.