కేరళ రాజధాని తిరువనంతపురంలో సదరన్ రీజినల్ కౌన్సిల్ భేటీ వాడివేడిగా జరిగింది. విభజన సమస్యలపై సదరన్ రిజీనల్ కౌన్సిల్ సమావేశంలో ప్రత్యేక ప్రస్తావన చేశారు ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఏపీ విభజన అశాస్త్రీయంగా, అన్యాయంగా జరిగింది. విభజన సమస్యలు ఇప్పటికీ ఏపీని వెన్నాడుతూనే ఉన్నాయి. విభజన సమస్యల పరిష్కారం.. విభజన హామీల అమలు జరగాలని ఏపీ ప్రజలు కోరుతున్నారు. విభజన జరిగి చాలా కాలం అవుతోన్నా.. ఇప్పటికీ ఆ సమస్యలు పెండింగులోనే ఉన్నాయి.
Read Also:Chinmayi Sripada: సమంతతో నా ప్రయాణం ముగిసింది.. విభేదాలపై క్లారిటీ
తిరుపతిలో జరిగిన సదరన్ కౌన్సిల్ మీటింగులో ఏపీకి సంబంధించి ఏడు కీలకాంశాలను సీఎం జగన్ ప్రస్తావించారు. విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్రం హైలెవల్ కమిటీ వేయడం సంతోషంగా వుందన్నారు. ఇందుకు ప్రధాని, హోం మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. త్వరితగతిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం మరింతగా సహకరించాలి. ఏపీలో వెనుకబడిన ఏడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద రూ. 25 వేల కోట్లు ఇవ్వాలి. 2014లో రూ. 24350 కోట్ల మేర నిధులను వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాలన్న ప్లానింగ్ కమిషన్ ప్రతిపాదనలు ఇంకా పెండింగులో ఉందన్నారు ఆర్థికమంత్రి బుగ్గన.
వెనుకబడిన జిల్లాలకిచ్చే ప్యాకేజీలో భాగంగా రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టుకు.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నిధులు కేటాయించాలన్నారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు.. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చే పన్ను రాయితీలను ఏపీకి ఇవ్వాలని బుగ్గన కోరారు. ఆదాయం సమకూర్చే హైదరాబాద్ లాంటి నగరాన్ని కోల్పోవడం వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు పన్ను రాయితీలు ఉపకరిస్తాయి. కేంద్రం ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా కేంద్రం చొరవ చూపాలి. కేంద్ర వ్యవసాయ యూనివర్శిటీ ఏర్పాటుకు సదరన్ కౌన్సిల్ ఛైర్మనుగా వ్యవహరిస్తున్న కేంద్ర మంత్రి వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని కోరారు.
Read Also:CM KCR: మతం పేరుతో చిచ్చు పెట్టే స్వార్థ రాజకీయాల్ని తిప్పికొట్టాలి
