ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వరి రైతుల పరిస్థితి క్లిష్టంగా మారింది. ఒక వైపు అనిశ్చితమైన వాతావరణం దిగుబడులను దెబ్బతీయగా.. మరోవైపు మార్కెట్లో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. దాంతో రైతులు రెండు దెబ్బలు ఒక్కసారిగా తిన్నట్లయ్యింది. ప్రభుత్వం మద్దతు ధర ఉన్నప్పటికీ.. టోకెన్లు, తేమ శాతం, నిబంధనలు ఇలా వరుస షరతులతో రైతులు తమ పంటను అమ్ముకునే అవకాశం లేక అల్లాడిపోతున్నారు.
Also Read: Alluri Agency Shock: అల్లూరి ఏజెన్సీలో దారుణం.. నిద్రిస్తున్న వ్యక్తిపై ఎలుగుబంటి దాడి!
కోత జరిగిన వెంటనే ధాన్యం తీసుకోలేమంటూ కేంద్రాలు తిరస్కరించడం రైతుల పరిస్థితిని మరింత కఠినంగా మారుస్తోంది. పంట పండించడం ఒకటి అయితే.. ఆ పంటను గోదాములకు చేర్చడం, సరైన ధరకు అమ్ముకోవడం మాత్రం రైతుల అసలైన పోరాటంగా మారిందని అవనిగడ్డ వరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వరి రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదురొంటున్నారు. ప్రభుత్వం మాత్రం ధాన్యం త్వరిగతిన కొనుగోలు చేస్తాం అని చెబుతున్నా.. ఆ దిశగా మాత్రం చర్యలు మాత్రం జరగడం లేదు. మొంథా, దిత్వా తుఫాన్‌లు రైతులను నిండా ముంచాయి.
