NTV Telugu Site icon

Kolagatla Veerabhadra Swamy: పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం.. అప్పులు సహజం..!

Kolagatla Veerabhadra Swamy

Kolagatla Veerabhadra Swamy

Kolagatla Veerabhadra Swamy: పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నప్పుడు అప్పులు చేయడం సహజం అన్నారు ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి.. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్టీఆర్ హయాంలో 2 రూపాలకే కిలో బియ్యాన్ని ప్రవేశ పెట్టారు. తద్వారా ప్రభత్వంపై భారం పడింది… అలా అని పేదలకు సంక్షేమ పథకాలను ఆపేయలేం కదా? అని ప్రశ్నించారు.. అలానే మేం కూడా పేద ప్రజలకు ప్రభుత్వ సొమ్ముతో పథకాలను అందిస్తున్నాం.. అలాంటి పరిస్థితిల్లో అప్పులు సహజం అన్నారు.. కానీ, ప్రతిపక్ష నేతలు కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Minister KTR: పేపర్‌ లీకేజీ, ధరల పెరుగుదలపై మంత్రి కేటీఆర్‌ ఫైర్‌

అయితే, చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్తాం.. ఎన్నికలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేశాం అన్నారు కోలగ్ల వీరభద్ర స్వామి.. అందులో భాగంగా ధైర్యంగా ప్రజల మధ్యకు వెళ్తున్నాం.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేక 2019లో ఓటమి పాలయ్యారన్న ఆయన.. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారని గుర్తుచేశారు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డిని ప్రజలు అభిమానిస్తుండటం వలన ప్రతిపక్ష నేతలు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారంటూ మండిపడ్డారు.. సామాన్య ప్రజల సాధికారిక కోసం పని చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని ఒడిస్తామనే భావిస్తే వారి అవివేకులు అంటూ హెచ్చరించారు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి.