NTV Telugu Site icon

ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి అస్వస్థత

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.. ప్రస్తుతం ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స తీసుకుంటున్నారు పుష్ప శ్రీవారి… విజయవాడ నుండి విజయనగరం వెళ్తుండగా.. ఆమె స్వల్ప అస్వస్థతకు గురైనట్టు అనుచరులు చెబుతున్నారు.. అయితే, పుష్ప శ్రీవాణి అస్వస్థతకు గురైన కారణాలతో పాటు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.. కాగా, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్ జగన్.. ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు.. చిన్న వయస్సులోనే ఎస్టీ కోటాలో పుష్ప శ్రీవాణికి మంత్రి పదవి దక్కింది. ఒకప్పుడు ఉపాధ్యాయురాలిగా పని చేసిన పుష్ప శ్రీవాణి భర్త ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చి కురుపాం అసెంబ్లీ స్థానం నుండి విజయం సాధించారు. ఆ తర్వాత ఏపీ కేబినెట్‌లో కీలక పోస్టు సొంతం చేసుకున్నారు.