Pawan Kalyan: దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శనలో భాగంగా షష్ట షణ్ముఖ క్షేత్రాలను ఏపీ డిప్యూటీ సీఎం పనవ్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ రోజు రోప్ వే ద్వారా పళని అర్ములిగ దండాయుధ మురుగన్ స్వామి వారి ఆలయానికి డిప్యుటీ సీఎం పవన్, ఆయన కుమారుడు అకీరా నందన్, టీటీడీ బోర్డు సభ్యులు ఆనంద్ సాయి చేరుకున్నారు. పళనిలో అత్యంత ముఖ్యమైన పండుగ థాయ్-పూస.. థాయ్ పండుగ పౌర్ణమి రోజుల్లోనే పవన్ కళ్యాణ్ మురుగన్ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక, ఆలయ పండితులు దైవిక మిశ్రమంగా పిలిచే తేనె, ఖర్జూరం, అరటిపండు, ఎండుద్రాక్ష, బెల్లం కలిపిన పంచమిర్థాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వీకరించారు.
Read Also: Chhaava’s Public Review: ‘ఛావా’ సినిమా చూసి కంటతడి పెడుతున్న ప్రేక్షకులు..
ఇక, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పళని నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు రవాణా సౌకర్యంపై దృష్టి పెడతామన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుకి తెలియ చేస్తా.. క్యాబినెట్ దృష్టికి తీసుకు వెళ్తానని పేర్కొన్నారు. మహారాష్ట్రలో పర్యటించినప్పుడు కూడా అక్కడి నుంచి తిరుపతి రావడానికి ప్రత్యేక రైలు వేయాలని అక్కడి ప్రజలు, ప్రజా ప్రతినిధులు నన్ను కోరారు.. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకు వెళ్లాను అని ఆయన వెల్లడించారు. తమిళనాడులో ఉన్న ఆరు ప్రసిద్ధి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించాలని ఇక్కడికి వచ్చా.. ఇతర రాజకీయాల అంశాల మీద స్పందించేందుకు ఇది సమయం కాదు అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.