Deputy CM Pawan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు (జనవరి 25న) మహారాష్ట్రలోని నాందేడ్‌లో పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు జూబ్లీహిల్స్ నివాసం నుంచి బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరి.. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో నాందేడ్‌కు పయనం కానున్నారు. ఉదయం 9.45 గంటలకు శ్రీ గురు గోబింద్ సింగ్ జీ విమానాశ్రయం, నాందేడ్‌కు చేరుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.20 గంటలకు నాందేడ్‌లోని తఖట్ సచ్ఖండ్ శ్రీ హజూర్ సాహిబ్ జీని పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఇక, గురుద్వారాలో సిక్కు దస్తార్ (టర్బన్) ధారణ డిప్యూటీ సీఎం పవన్ చేయనున్నారు. దర్బార్ సాహిబ్‌లో ప్రత్యేక ప్రార్థనలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చౌర్ సాహిబ్ సేవ, అర్ధాస్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. గురుద్వారా కమిటీ ఆధ్వర్యంలో రేపు (జనవరి 26న) పవన్ కళ్యాణ్‌కు సత్కారం చేయనున్నారు. మధ్యాహ్నం 2.10 గంటలకు శ్రీ గురు తేగ్ బహదూర్ సాహిబ్ జీ 350వ షహీదీ సమాగమంలో పాల్గొనే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలకు మోడీ మైదాన్‌లో ప్రధాన దర్బార్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం అనంతరం సాయంత్రం 4.30 గంటలకు నాందేడ్ నుంచి బేగంపేటకు తిరుగు ప్రయాణం అవుతారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్ నివాసానికి ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ చేరుకోనున్నారు.
