Site icon NTV Telugu

జగన్‌పై కేసులు పెట్టినవారంతా.. రాజకీయంగా జీరో అయ్యారు..!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జన్మోహన్‌రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. అదే సమయంలో.. వైఎస్‌ జగన్‌ను టార్గెట్‌ చేసి కేసులు వేస్తున్నవారిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. ఇవాళ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న నారయణస్వామి.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పేదవాళ్లు సీఎం వైఎస్‌ జగన్ ని దేవుడిగా కొలుస్తున్నారన్నారు.. ఇక, ఎన్టీఆర్‌కి నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పోడిస్తే… ఇప్పుడు ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. సీఎం జగన్‌కి వెన్నుపోటు పోడవాలని చూస్తున్నారంటూ కామెంట్ చేశారు.. మరోవైపు.. వైఎస్‌ జగన్ పై కేసులు పెట్టిన వారంతా… రాజకీయంగా జీరో అయ్యారని గుర్తుచేసిన నారాయణస్వామి.. ఇక, మాదకద్రవ్యాల రవాణాపై శాఖాపరమైన విచారణకు ఆదేశించినట్టు వెల్లడించారు.

Exit mobile version