గత రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తున్న కరోనా మహామ్మారి తగ్గుముఖం పడుతోంది. మొన్నటి వరకు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుండడంతో ఏపీలో కరోనా కేసులు బీభత్సంగా పెరగిపోయాయి. అయితే వెంటనే అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించి కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది. దీంతో కరోనా కేసులు మళ్లీ అదుపులోకి వచ్చాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటల్లో 14,516 కరోనా పరీక్షలు నిర్వహించగా, 79 కొత్త కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి (13), తూర్పు గోదావరి (11) జిల్లాల్లో మాత్రం రెండంకెల్లో కేసులు వెల్లడయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాకపోగా, మిగిలిన అన్ని జిల్లాల్లో సింగిల్ డిజిట్ లో కొత్త కేసులు వెలుగు చూశాయి.
అదే సమయంలో 167 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వరుసగా మరో రోజు కూడా ఎలాంటి మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,18,417 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 23,02,625 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,063 మందికి చికిత్స జరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 14,729 మంది కరోనాతో మరణించారు.