Site icon NTV Telugu

కోవిడ్ టెర్ర‌ర్‌: ఏపీలో భారీగా పెరిగిన క‌రోనా కేసులు…

ఏపీలో క‌రోనా కేసులు అంత‌కంత‌కు పెరుగుతున్నాయి.  రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతుండ‌టంతో ఇప్ప‌టికే నైట్ కర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు.  తాజాగా రాష్ట్రంలో 10,057 క‌రోనా కేసులు న‌మోదైన‌ట్టు ఏపీ ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.  గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 8 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 21,27,441కి చేరింది.  ఇందులో 20,67,984 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 44,935 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం క‌రోనాతో 14,522 మంది మృతి చెందారు.  గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనా నుంచి 1222 మంది కోలుకొని డిశ్చార్జ్ అయిన‌ట్టు ఏపీ ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది.  ఇక జిల్లాల వారిగా 24 గంట‌ల్లో న‌మోదైన కేసుల వివ‌రాలు ఇలా ఉన్నాయి.  

Read: ఉత్త‌ర‌కొరియా దెబ్బ‌కు విల‌విల‌లాడుతున్న బ్లాక్‌చెయిన్ టెక్నాల‌జీ…

అనంత‌పురంలో 861, చిత్తూరులో 1822 కేసులు, తూర్పు గోదావ‌రిలో 919, గుంటూరులో 943, క‌డ‌ప‌లో 482, కృష్ణాలో 332, క‌ర్నూల్‌లో 452, నెల్లూరులో 698, ప్ర‌కాశంలో 716, శ్రీకాకుళంలో 407, విశాఖ‌ప‌ట్నంలో 1827, విజ‌య‌న‌గ‌రంలో 382, ప‌శ్చిమ గోదావ‌రిలో 216 కేసులు న‌మోద‌య్యాయి.  కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవ‌డంతో ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి. 

Exit mobile version