NTV Telugu Site icon

వారికి సీఎం జగన్‌ గుడ్‌న్యూస్‌.. ఖాతాల్లోకి ఇవాళే సొమ్ము

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో సంక్షేమ పథకాలతో నేరుగా ప్రజల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తూ వస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పటికే గనన్న చేదోడు పథకం కింద రాష్ట్రంలోని దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఏటా నిధులు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే కాగా.. వరుసగా రెండో ఏడాది నగదును ఇవాళ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మొత్తం 2.85 లక్షల మంది రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీలకు రెండో విడతలో రూ.285 కోట్లను విడుదల చేసేందుకు సిద్ధం అయ్యింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సర్కార్..

Read Aslo: ఫిబ్రవరి 8, మంగళవారం దినఫలాలు..

ఇవాళ క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నగదు బదిలీ చేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్.. కాగా, ఈ పథకం కింద ప్రతి ఏడాది షాపులున్న ప్రతిఒక్కరికి రూ.10వేల ఆర్ధిక సాయాన్ని అందిస్తోంది సర్కార్.. రెండో విడతలో 1.46 లక్షల మంది టైలర్లకు రూ.146 కోట్లు, షాపులున్న 98వేల మంది రజకులకు రూ.98.44 కోట్లు, షాపులున్న 40వేల మంది నాయీ బ్రాహ్మణులకు రూ.40 కోట్ల నగదును లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తారు..