YS Jagan: నేడు కారుమంచికి సీఎం వైఎస్‌ జగన్‌..

Ys Jagan

Ys Jagan

YS Jagan: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు.. కొండేపి వైసీపీ ఇంఛార్జ్‌ వరికూటి అశోక్ బాబు తల్లి అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించనున్నారు సీఎం జగన్‌… వరికూటి కోటమ్మ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు టంగుటూరు కారుమంచి వెళ్లనున్నారు ఏపీ సీఎం.. ఇక, ఈ పర్యటన కోసం ఉదయం 10 గంటలకు తాడేపల్లి సీఎం నివాసం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 10.05 గంటలకు హెలీప్యాడ్ చేరుకుంటారు. 10.10 గంటలకు హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 10.55 గంటలకు కారుమంచి జెడ్పీ హైస్కూలులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు.. ఉదయం 11.05 కు కారుమంచిలోని వరికూటి అశోక్ బాబు నివాసానికి చేరుకుని ఆయన తల్లి కోటమ్మ భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.. అక్కడి నుంచి తిరిగి హెలీప్యాడ్ వద్దకు చేరుకుని స్థానిక నేతలను కలుస్తారు.. అనంతరం 12.10 కారుమంచి హైస్కూల్ హెలీప్యాడ్ నుంచి మధ్యాహ్నం 1.05 చేరుకుంటారు. ఆ తర్వాత తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం జగన్‌. మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు.. ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపట్టారు.

Read Also: TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ రోజే ఆ టికెట్లు విడుదల