CM Jagan: కుమార్తెను చూసి గర్వపడిన సీఎం జగన్-భారతి దంపతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా ప్రస్తుతం ప్యారిస్ పర్యటనలో ఉన్నారు. తన రెండో కుమార్తె హర్షిణి రెడ్డి ప్యారిస్‌లోని ఇన్సీడ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పట్టా అందుకుంటున్న సందర్భంగా తమ కుమార్తె కాన్వకేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం జగన్ అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా శుక్రవారం నాడు ఈ పట్టా ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో జగన్, ఆయన భార్య భారతి పాల్గొన్నారు. తమ కుమార్తె డిగ్రీ పట్టా అందుకున్న తరుణంలో సీఎం జగన్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also: Pawan Kalyan: సమాజ క్షేమమే.. జనసేన పార్టీ ధ్యేయం
Also Read
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
‘డియర్ హర్షా చాలా గర్వంగా ఉంది. నీవు ఎదిగిన తీరు అమిత సంతోషాన్నిచ్చింది. దేవుడు నీ పట్ల కృప చూపించాడు. ఈ రోజు ఇన్సీడ్ నుంచి డిస్టింక్షన్‌తో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం నాకు గర్వంగా ఉంది’ అంటూ జగన్ తన ట్వీట్‌లో తెలిపారు. తన కుమార్తెకు డిస్టింక్షన్‌తో పాటు డీన్స్ జాబితాలోనూ చోటు దక్కడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా హర్షిణి రెడ్డితో జగన్ దంపతులు దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తల్లిదండ్రుల సమక్షంలోనే హర్షిణి రెడ్డి పట్టా పుచ్చుకున్నట్లు ఈ ఫోటోలో చూడొచ్చు. రేపు సాయంత్రం ప్యారిస్ పర్యటన ముగించుకుని సీఎం జగన్ గన్నవరం చేరుకోనున్నారు. కాగా ప్రఖ్యాత యూనివర్సిటీ నుంచి హర్షిణి రెడ్డి డిగ్రీ పట్టా అందుకోవడంపై సోషల్ మీడియాలో నెటిజన్‌ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Dear Harsha, it’s been a wonderful journey watching you grow up. God has been abundantly gracious. Today I’m proud to see you graduate from INSEAD with distinction and on the Dean’s list. Wishing you God’s very best! pic.twitter.com/7FuZcXp4uT
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 2, 2022
తాజావార్తలు
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!