Site icon NTV Telugu

CM Jagan: ఏపీలో డ్రగ్స్, గంజాయి అసలు కనిపించకూడదు..!!

Cm Jagan

Cm Jagan

CM Jagan:  అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ), ఎక్సైజ్‌ శాఖపై క్యాంప్‌ ఆఫీస్‌లో సీఎం జగన్‌ సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఏపీని నార్కొటిక్స్‌ రహిత రాష్ట్రంగా మార్చాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఎక్కడా మాదక ద్రవ్యాలు వినియోగం ఉండొద్దన్నారు. ఆ లక్ష్యంతోనే పోలీస్, ఎక్సైజ్‌ శాఖలు పని చేయాలన్నారు. ప్రతి కాలేజీ, ప్రతి వర్సిటీలో భారీ హోర్డింగ్స్‌ పెట్టాలని.. ఎస్‌ఈబీ టోల్‌ఫ్రీ నెంబర్‌ను బాగా ప్రచారం చేయాలని జగన్ సూచించారు. పోలీస్, ఎక్సైజ్, ఎస్‌ఈబీ పూర్తి సమన్వయంతో పని చేయాలని సీఎం జగన్ తెలిపారు.

Read Also: Etela Rajender: గవర్నర్ తమిళిసైతో భేటీ అయిన ఎమ్మెల్యే ఈటల

వారంలో ఒకరోజు తప్పనిసరిగా పోలీస్, ఎక్సైజ్, ఎస్‌ఈబీ శాఖలు సమావేశం కావాలని.. వారంలో మరో రోజు పోలీస్‌ శాఖలో ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టాలని సీఎం జగన్ వెల్లడించారు. ఇక నుంచి రెగ్యులర్‌గా ఈ కార్యక్రమాలు జరగాలని ఆదేశించారు. అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టాలని.. ఎక్కడా గంజాయి సాగు జరగకుండా చూడాలని తెలిపారు. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలన్నారు. సచివాలయాల మహిళా పోలీసులను కూడా సమన్వయం చేయాలన్నారు. వారిని ఇంకా సమర్థంగా వినియోగించుకోవాలని హితవు పలికారు. మహిళా పోలీసుల పనితీరు ఇంకా మెరుగుపర్చాలన్నారు. దిశ చట్టం, యాప్‌ ఇంకా సమర్థంగా అమలు కావాలన్నారు.

కాగా సీఎం జగన్ మంగళవారం నాడు విజయవాడలో పర్యటించనున్నారు. క్రిస్మస్‌ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. సాయంత్రం 5:20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరి సాయంత్రం 5:30 గంటలకు విజయవాడ ఏ ప్లస్‌ కన్వెన్షన్‌కు చేరుకోనున్నారు. క్రిస్మస్‌ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్యక్రమానికి సీఎం జగన్ హాజరు కానున్నారు. సాయంత్రం 6 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Exit mobile version