ఏపీ సీఎం జగన్ శుక్రవారం నాడు (ఏప్రిల్ 8) నంద్యాలలో పర్యటించనున్నారు. ఎస్‌పీజీ గ్రౌండ్ నంద్యాలలో జగనన్న వసతి దీవెన పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి సీఎం జగన్ ప్రత్యేక హెలికాప్టర్‌లో నంద్యాలకు బయలుదేరనున్నారు. ఉదయం 11:10 గంటలకు నంద్యాల గవర్నమెంట్ డిగ్రీకాలేజీకి చేరుకుంటారు. ఉదయం 11:35- 12:35 గంటల మధ్య ఎస్‌పీజీ గ్రౌండ్‌కి చేరుకుని జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించి బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 12:45 గంటలకు నంద్యాల నుంచి సీఎం జగన్ తిరుగుపయనం కానున్నారు. మధ్యాహ్నం 2:25 గంటలకు సీఎం జగన్ తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు.
కాగా ఈనెల 11న ఏపీలో కొత్త కేబినెట్ కొలువుదీరనుంది. ఈ మేరకు ఆరోజు పాత మంత్రులందరూ అందుబాటులో ఉండాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. పాత మంత్రుల్లో కొందరికి మరోసారి మంత్రి పదవులు వరించే అవకాశాలున్నాయి. అయితే వారెవరు అన్నది తెలియాల్సి ఉంది.