Site icon NTV Telugu

Cm Jagan Mohan Reddy: సీఎం జగన్ దీపావళి శుభాకాంక్షలు

Cm Jagan (5)

Cm Jagan (5)

దీపావళి పండుగ సందర్భంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (Cm Jagan mohan reddy) శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటా ‘ఆనంద దీపావళి (Happy diwali) కావాలన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చీకటిపై ‘వెలుగు’.. చెడుపై ‘మంచి’.. అజ్ఞానంపై ‘జ్ఞానం’.. దుష్ట శక్తులపై ‘దైవశక్తి’.. సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆనంద కాంతులు నింపాలని ఆకాంక్షించారు.

Read Also: PM Modi in Ayodhya: అయోధ్య దీపోత్సవంలో ప్రధాని మోడీ.. సరయూ నది తీరంలో వేడుకలు

ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, దివ్వెల వెలుగుల‌లో ప్రతి కుటుంబం సుఖ‌సంతోషాల‌తో విరాజిల్లాల‌ని జగన్ అభిలషించారు. మరోవైపు దీపావళి సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు. బాణాసంచా విక్రయ దుకాణాలకు అన్ని రకాల సేఫ్టీ నిబంధనలు పాటించాకే అనుమతులు మంజూరు చేశారు. అన్ని చోట్ల ఫైర్ సేఫ్టీ తప్పనిసరిగా తీసుకోవాలని పోలీసులు సూచించారు. తిరుపతి, విజయవాడ లాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. దీపావళి నాడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు.
Read Also: India vs Pakistan: కోహ్లీ ఎన్నడూ ఏడ్వలేదు.. ఇవాళ తొలిసారి ఏడ్చాడు

Exit mobile version