Site icon NTV Telugu

Krishna District: సీఎం జగన్ కటౌట్‌కు నిప్పు.. పిరికిపందల చర్యగా వైసీపీ నేతల మండిపాటు

Jagan Cut Out

Jagan Cut Out

Krishna District: కృష్ణా జిల్లా మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారి పక్కన గూడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఏర్పాటు చేసిన సీఎం జగన్ కటౌట్‌కు గర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

బందరు డీఎస్పీ భాషా, పెడన రూరల్ సీఐ వీరయ్య ప్రసన్నగౌడ్, గూడూరు ఎస్సై వెంకట్ ఈ ఘటనపై విచారణ చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. అటు సీఎం జగన్ కటౌట్‌కు నిప్పు పెట్టడాన్ని వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ విషయం తెలిసిన వెంటనే గూడూరు ఎంపీపీ మధుసూదన్‌రావు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కారుమంచి కామేశ్వరరావు, గూడూరు ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ డైరెక్టర్ ఎన్‌ఏ సలీం, వైసీపీ దళిత నాయకుడు వెంకటేశ్వరరావు కాలిపోయిన జగన్ కటౌట్‌ను పరిశీలించారు.

Read Also: Nidhi Agarwal: ఆ డైరెక్టర్ నన్ను చూడగానే ముందు ముఖం కడుక్కో అన్నాడు

పెడనలోని చేనేత కార్మికులకు చేయూత పథకాన్ని లబ్ధిదారులకు ఇవ్వడానికి సీఎం జగన్ వచ్చి సందర్భంగా నెలరోజుల క్రితం ఈ కటౌట్‌ను ఏర్పాటు చేసినట్లు వైసీపీ నేతలు తెలియజేశారు. కానీ ఇలాంటి చర్య దుర్మార్గమని మండిపడ్డారు. రాజకీయాల్లో అనేక గొడవలు ఉంటాయి కానీ ఫ్లెక్సీలకు, కటౌట్లకు నిప్పు అంటించడం అనేది పిరికిపందల చర్య అని కారుమంచి కామేశ్వరరావు విమర్శించారు. ఏదన్నా ఉంటే ముఖాముఖి మాట్లాడుకోవాలి.. సమస్య పరిష్కరించుకోవాలని హితవు పలికారు.

 

Exit mobile version