ఏపీ సీఎం కీలక నిర్ణయం.. ఆ చట్ట సవరణకు అంగీకారం !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సహకార శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయ, సహకారశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సహకార బ్యాంకులు, ప్రాథమిక సహకార వ్యవసాయ పరపతి సంఘాల పనితీరుపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. కడప, కర్నూలు, అనంతపురం, ఏలూరు డీసీసీబీలు నిర్వీర్య దశలో ఉన్నాయని సీఎంకు అధికారులు వివరించారు. వాటి లైసెన్స్‌లు కూడా రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 45 శాతం పీఏసీఎస్‌లు పూర్తిగా నష్టాల్లో ఉన్నాయని అధికారులు తెలిపారు.
49 శాతం మండలాలకు డీసీసీబీ బ్రాంచ్ నెట్‌వర్క్‌తో అనుసంధానం లేదని తక్కువగా రుణాలు ఇవ్వడంతో పాటు మోసాలు అధికంగా జరుగుతున్నాయని సీఎంతో అధికారులు పేర్కొన్నారు. నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్- సిఫార్సులపై కూడా సమావేశంలో చర్చించారు. ఆప్కాబ్, డీసీసీబీలు, పీఏసీఎస్‌లను కంప్యూటరీకరణ చేయాలని సూచనలు చేసిన సీఎం పీఏసీఎస్‌ల్లో క్రమం తప్పకుండ ఆడిటింగ్ చేయించాలని ఆదేశించారు. రిపోర్టుల్లో వ్యత్యాసం కనిపిస్తే ఏం చేయాలన్న దానిపై కూడా కార్యాచరణ ఉండాలని సీఎం పేర్కొన్నారు. థర్డ్‌పార్టీతో స్వతంత్రంగా విచారణ చేయించాలన్న సీఎం గ్రామ సచివాలయాల్లోని వ్యవసాయ అసిస్టెంట్లను పీఏసీఎస్ సభ్యులుగా తీసుకురావాలని సిఫార్సు చేశారు. ఈమేరకు చట్ట సవరణకు సీఎం జగన్ అంగీకరించారు. ప్రతీ 3 ఆర్బీకేలకు ఒక పీఏసీఎస్ ఉండేలా చూడాలని ప్రతిపాదన రాగా దానికి కూడా సిఎం సానుకూలంగా స్పందించారు.
Also Read
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
- AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Tags
- ap cm. ys jagan
- cm jagan
తాజావార్తలు
-
Hide & Silk: సుహాస్ కొత్త సినిమా టైటిల్ ఇదే!
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!