సహకార శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయ, సహకారశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సహకార బ్యాంకులు, ప్రాథమిక సహకార వ్యవసాయ పరపతి సంఘాల పనితీరుపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. కడప, కర్నూలు, అనంతపురం, ఏలూరు డీసీసీబీలు నిర్వీర్య దశలో ఉన్నాయని సీఎంకు అధికారులు వివరించారు. వాటి లైసెన్స్‌లు కూడా రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 45 శాతం…