NTV Telugu Site icon

Chandrababu- Pawan: నేడు హర్యానాకి ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు..

Ap

Ap

Chandrababu- Pawan: నేడు హర్యానా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వెళ్తున్నారు. వీరు ఎన్డీయే కూటమిలో భాగమైనందున హర్యానాకు వెళ్తున్నారు. ఇక, ప్రమాణస్వీకారం తర్వాత ఎన్డీయే పక్ష నేతలతో జరిగే సమావేశంలో వీరు పాల్గొంటారు. కాగా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమిలో చంద్రబాబు చేరారు. ఈ ఎన్నికల్లో జనసేన, బీజేపీ పార్టీలతో పొత్తు పెట్టుకొన్న టీడీపీ ఆంధ్రప్రదేశ్ లో పసుపు జెండా ఎగురవేశారు. మరోవైపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి రాష్ట్ర అభివృద్ధి కొరకు వరుసగా ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక పాత్ర పోషించారు.

Read Also: AP Rains: తీరం దాటిన దాటిన వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాలు..

అయితే, ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ మూడో సారీ అధికార పీఠాన్ని దక్కించుకుంది. ఇక, ముఖ్యమంత్రి కుర్చీలో ఎవరు కూర్చోవాలనే దానిపై జరుగుతున్న చర్చకు కమలం హైకమాండ్ తెర దింపింది. హర్యానా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ పేరును ఖరారు చేసింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, సీనియర్ నాయకులు అనిల్ విజ్ కూడా నాయబ్ సింగ్ సైనీకు మద్దతు పలికారు. దీంతో సభ్యులందరూ కూడా ఆయన్ని బీజేపీ ఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక, హర్యానా ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ఈరోజు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, పార్టీ కీలక నేతలు ఈ వేడుకకు హాజరుకానున్నారు.