Site icon NTV Telugu

ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటికి మరోసారి ఏపీ సీఐడీ..

Raghu Rama

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రెబల్‌ నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటికి మరోసారి వెళ్లారు ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ అధికారులు.. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని రఘురామ ఇంటికి వెళ్లారు ఏపీ సీఐడీ అధికారులు.. గతంలో రఘురామను విచారించిన సీఐడీ, ఆ తర్వాత ఆయనను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే కాగా.. మరోసారి సీఐడీ పోలీసుల విచారణకు రావాలని రఘురామకృష్ణరాజుకు నోటీసులు ఇచ్చేందుకే వచ్చినట్టుగా చెబుతున్నారు.. రేపు సీఐడీ విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు ఇవ్వనున్నట్టుగా సమాచారం.. మరి సీఐడీ నోటీసుల్లో ఏముందో..? ఎంపీ రఘురామ ఈ విషయంలో ఎలా స్పందిస్తారో..? అనేది వేచిచూడాల్సిన విషయం. కాగా, గతంలో సీఐడీ విచారణ, అరెస్ట్‌పై పెద్ద వివాదమే నడిచింది.. ఆయన పాదాలపై మరకల వ్యవహారం చర్చగా మారింది.. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లిన విషయం తెలిసిందే.

Read Also: సైనాకు హీరో సిద్ధార్థ్‌ బహిరంగ క్షమాపణ.. వివాదం ముగిసినట్టేనా..?

Exit mobile version