సైనాకు హీరో సిద్ధార్థ్‌ బహిరంగ క్షమాపణ.. వివాదం ముగిసినట్టేనా..?

హీరో సిద్ధార్థ్‌ సోషల్‌ మీడియా వేదికగా బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌పై చేసిన ఓ కామెంట్ పెద్ద దుమారమే రేగింది.. ప్రధాని పంజాబ్‌ పర్యటనలో చోటుచేకున్న భద్రతాలోపాన్ని ప్రస్తావించిన సైనా.. దేశ ప్రధానికే భద్రత లేకపోతే.. ఇక ఆ దేశం భద్రంగా ఉందని ఎలా భావించగలం? ప్రధాని మోడీపై అరాచకవాదుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.. అయితే, సైనా ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. చిన్న కాక్‌తో ఆడే ప్రపంచ ఛాంపియన్‌..! దేవుడా ధన్యవాదాలు.. భారత్‌ను కాపాడటానికి కొందరు రక్షకులు ఉన్నారు.. అంటూ కామెంట్ చేయడంతో అసలు వివాదం మొదలైంది.. జాతీయ మహిళా కమిషన్‌, కొందరు ప్రముఖులు, చివరకు సైనా తండ్రి హర్వీర్‌సింగ్‌ నెహ్వాల్ కూడా సిద్ధార్థ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.. ఈ నేపథ్యంలో బహిరంగంగా సైనా నెహ్వాల్‌కు క్షమాపణలు చెప్పారు హీరో సిద్ధార్థ్..

Read Also: వంగవీటి రాధాకు కరోనా.. హైదరాబాద్‌కు తరలింపు..

సైనా నెహ్వాల్‌కు బహిరంగ క్షమాపణలు చెబుతూ ఓ లేఖను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు హీరో సిద్ధార్థ్.. తాను ఎవరినీ అగౌరవపరిచ లేదని చెప్పే ప్రయత్నం చేసిన సిద్ధార్థ్.. సైనా నెహ్వాల్‌ పెట్టిన ట్వీట్ మీద తాను రియాక్ట్ అవుతూ చేసిన ఆ కామెంట్.. ఒక జోక్ మాత్రమే నంటూ తన లేఖలో పేర్కొన్నాడు.. కాకపోతే తాను చేసిన ఆ కామెంట్ చాలా మందిని బాధించిందని, మహిళలను కించపరుస్తూ కామెంట్స్ చేయాలనే ఉద్దేశంతో మాత్రం అలా చేయలేదని సిద్దార్థ్ వివరణ ఇచ్చుకున్నాడు.. సైనా నెహ్వాల్ ఓ గొప్ప క్రీడాకారిణి, ఆమెను ఎప్పుడూ గౌరవిస్తానని పేర్కొన్నాడు.. నువ్వు ఎప్పుడూ నాకు ఛాంపియన్‌గా ఉంటావు’ అని రాసుకొచ్చాడు సిద్ధార్థ్.. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుండగా.. మరి ఈ వివాదం ఇంతటితో ముగిసిపోందా? సైనా ఎలా రియాక్ట్‌ అవుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

Related Articles

Latest Articles