ఏపీ టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తనయుడు చింతకాయల విజయ్ ఇంట్లో సీఐడీ పోలీసులు హల్చల్ చేశారు. పోలీసులు వచ్చిన సమయంలో విజయ్ ఇంట్లో లేరు. సీఐడీ సిబ్బంది విజయ్ అడ్రస్ కోసం డ్రైవర్ ని కొట్టినట్టు చెబుతున్నారు. విజయ్ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి ఇల్లంతా సోదాలు చేశారు పోలీసులు…బెడ్రూం, కిచెన్ తో పాటు ఇంట్లో ఉన్న కప్ బోర్డులను చెక్ చేశారు పోలీసులు. విజయ్ ఇద్దరు చిన్న పిల్లలను కూడా సీఐడీ పోలీసులు వదలలేదు. తండ్రి విజయ్ ఆచూకీ చెప్పాలని పిల్లలను బెదిరించారు పోలీసులు.
చింతకాయల విజయ్ కి ఏపీ సీఐడీ 41 సీఆర్ పీసీ నోటీసులు జారీచేశారు. టీవీలో చూసి నోటీస్ ఇచ్చేందుకు వచ్చాం అని బుకాయించారు. ఇంట్లో ఉన్న సిబ్బందికి 41 సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చారు. సీఐడీ పీఎస్ లో నమోదయిన కేసులో హాజరు కావాలని నోటీసులు జారీచేశారు. ఏపీ సీఐడీ పోలీసుల తీరుపై తెలంగాణలోని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని టీడీపీ నేత చింతకాయల విజయ్ ఇంటికి AP పోలీసులు వచ్చారని, విజయ్ ఇంట్లో లేకపోవడంతో సర్వెంట్ ను అదుపులోకి తీసుకున్నారు.
Read Also:Rajasthan: బాలికపై సామూహిక అత్యాచారం.. వీడియో వైరల్ చేస్తామని డబ్బులు డిమాండ్
ఏపీ పోలీసుల తీరుపై మండిపడ్డారు టీడీపీ యూత్ నేత పొగాకు జయరాం. ఏపీ పోలీసుల మంటూ దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించడంపై కంప్లైంట్ ఇవ్వడానికి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ కి ఆయన బయల్దేరారు. టీడీపీ ఆంధ్ర నాయకులు అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ ఇంటిపై ఏపీ cid పోలీసులు అక్రమంగా ప్రవేశించి భయబ్రాంతులకు గురి చేయడం చాలా హేయమైన చర్య అని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అరాచకాలకు పాల్పడటం కక్షపూరితంగా వ్యవహరించడం తగదన్నారు. రానున్న రోజుల్లో ఏపీ లోని అధికార పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
రాబోయే రోజుల్లో టీడీపీ ఏపీలో అధికారంలోకి వస్తుందని తమ కార్యకర్తలపై దాడులు పాల్పడితే సహించేది లేదని జీవన్ కుమార్ హెచ్చరించారు. ఏపీ సీఐడీ పోలీసులమంటూ చింతకాయల విజయ్ ఇంటిపై పోలీసులు దాడులు చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లల్ని, ఆడవాళ్ళను కూడా భయభ్రాంతులకు గురి చేయడం ఇలాంటి చర్యలు పోలీసులకు తగదని అన్నారు. వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Read Also: Sampath Nandi: ‘ఓదెల రైల్వే స్టేషన్’ కోసం పారితోషికం లేకుండా….