AP Cabinet: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి సచివాలయంలో ఇవాళ ( జనవరి 28న) కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ముఖ్యంగా వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. కేబినెట్ అజెండాలోని అంశాలపై చర్చించిన తర్వాత ఏపీ బడ్జెట్ సెషన్ నిర్వహణపై మంత్రివర్గంలో డిస్కషన్ చేసే అవకాశం ఉంది.
Read Also: Arijith Singh : మ్యూజిక్ లవర్స్‌కి బ్యాడ్ న్యూస్.. సింగింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అర్జిత్ సింగ్!
అలాగే, అసెంబ్లీ సమావేశాల తేదీలు, నిర్వహణ విధానంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇదిలా ఉండగా, వైసీపీ చేస్తున్న విమర్శలను సమర్థవంతంగా సమాధానం ఇవ్వాలని ఇప్పటికే మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన చోట తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, ముఖ్యమంత్రి దావోస్ పర్యటన అంశంపైనా కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది.
