NTV Telugu Site icon

Sunil Deodhar: దాన్ని అంతం చేసేందుకు.. జనసేన, బీజేపీ కలిపి పోరాడుతాయి

Sunil Deodhar

Sunil Deodhar

AP BJP Incharge Sunil Deodhar Sensational Comments On Kodali Nani: ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దేవ్‌ధర్ తాజాగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శిక్ష పడిన ఖైదీ, బూతుల ఎమ్మెల్యేల పాలనలో ఏపీ సర్వనాశనం అయ్యిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవినీతి జగన్ పాలనను అంతం చేసేందుకు జనసేన, బీజేపీ కలిసి పోరాడుతున్నాయని చెప్పారు. ప్రకృతి కారణంగా 45 డిగ్రీల వేడి ఉండే.. జగన్ పాలనలో అంతకుమించి పది శాతం వేడితో ప్రజలు అల్లాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ అరాచక వాదులు, అవినీతి పరులు.. రాష్ట్రంలో అన్ని మింగేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు దోచుకున్న డబ్బును తాడేపల్లి ప్యాలెస్‌కు పంపుతున్నారన్నారు. ఇసుక, మద్యం, గంజాయి మాఫియాలదే ఏపీలో రాజ్యం నడుస్తోందన్నారు. ఆలీబాబా 40 దొంగలు మాదిరి జగన్ ప్రభుత్వ పాలన కొనసాగుతోందన్నారు. లూటీలు, అరాచకాలు చేస్తున్న జగన్ ప్రభుత్వంపై క్రిమినల్ చార్జ్ షిటు వేయాలన్నారు.

Karnataka: కాంగ్రెస్ బిగ్ ట్విస్ట్… సీఎం అభ్యర్థిని ఇంకా తేల్చలేదు..

ఇదే సమయంలో ఎమ్మెల్యే కొడాలి నానిపై సునీల్ దేవ్‌ధర్ విరుచుకుపడ్డారు. గుడివాడ నియోజకవర్గ సమస్యలపై బీజేపీ చార్జిషీట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తే, కొడాలి నాని లాంటి ఎమ్మెల్యేలను జైలుకు పంపుతామన్నారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడుతూ ఫేస్ అయ్యాడన్నారు. ఆ ఎమ్మెల్యే మాటలతో ఏపీ పరువు పోతుందన్నారు. తెలుగువారికి విశిష్టత కలిగిన సంక్రాంతి పండుగను.. క్యాసినో, క్యాబిరే డ్యాన్స్‌లుగా మార్చేశారన్నారు. గుడివాడ యువతను సర్వనాశనం చేస్తున్న కొడాలి నానిని జీవితంలో అసెంబ్లీ గడప తొక్కకుండా ప్రజలు చేయాలన్నారు.

Venugopala Krishna: పవన్ కళ్యాణ్ ముసుగు తొలగిపోయింది