Site icon NTV Telugu

Somu Veerraju: వైసీపీ ప్రభుత్వం తోలు మందం.. బుర్ర లేని ప్రభుత్వం..!

Somu Veerraju

Somu Veerraju

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు.. కోస్తా, ఆంధ్ర, గోదావరి జోన్ల బీజేపీ పదాధికారుల సమావేశంలో సునీల్ ధియోధర్‌తో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై ఫైర్‌ అయ్యారు.. అసలు వైసీపీ ప్రభుత్వం తోలు మందం ప్రభుత్వం.. బుర్రలేని ప్రభుత్వం అంటూ విమర్శలు గుప్పించారు.. నేచుర్ క్యూర్ ఆసుపత్రికి గత ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఇళ్ళ పట్టాల పేరుతో ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించిన ఆయన.. బటన్ నొక్కడమే పనిగా ఈ ప్రభుత్వం పని చేస్తుందని.. అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడిపించడంలో ప్రభుత్వం విఫలమైందని.. రూ. 35 లక్షల ఇళ్లు కేంద్రమిస్తే ఇప్పటి వరకూ పూర్తి చేయలేదని ఆరోపించారు.

Read Also: Director Prashanth Neel: దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ విరాళం.. రఘువీరారెడ్డి భావోద్వేగం

కేంద్రమిచ్చిన నిధులను తమ సొంత ఖాతాల్లో నుంచి ఇచ్చినట్లు బటన్ నొక్కి పంచుతున్నారు అంటూ ఏపీ సర్కార్‌పై ధ్వజమెత్తారు సోము వీర్రాజు.. చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు కారిడార్లను కేంద్రమే ఇచ్చిందన్న ఆయన.. కేంద్రం రాజధాని కోసం నిధులిస్తే.. ఏపీకి రాజధాని లేకుండా చేశారని దుయ్యబట్టారు.. ప్రత్యేక ప్యాకేజీస్తే నిధులు తీసుకొని రాలేదని విమర్శించిన ఆయన.. వైసీపీ ప్రభుత్వం తోలు మందం ప్రభుత్వం అని మండిపడ్డారు. ఇక, ఈ నెల 21న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం.. ఆ సభలో కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాగూర్, కిషన్ రెడ్డి కూడా పాల్గొంటారని వెల్లడించారు ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు.

Exit mobile version