గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయన్న విషయంపై స్పష్టత లేదు. ఆరునెలల విరామం తర్వాత అసెంబ్లీ జరగనుండటంతో పలు కీలక ఆర్డినెన్సులను ఆమోదించాలని సభ ముందుకు ప్రభుత్వం తీసుకురానుంది. ఈ ఏడాది జులై నుంచి ఇప్పటివరకు వివిధ శాఖలకు సంబంధించి ప్రభుత్వం 14 ఆర్డినెన్సులను జారీ చేసింది. ఒకేరోజున 14 ఆర్డినెన్స్‌లను శాసనసభ, శాసన మండలి ఆమోదించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
Read Also: అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదానికి రానున్న 14 ఆర్డినెన్స్‌లు
రాష్ట్రంలో ప్రజా సమస్యలపై సభలో సుదీర్ఘంగా చర్చించాలని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ డిమాండ్ చేస్తోంది. కనీసం 15 రోజులు సమావేశాలు పెట్టాల్సిందే అని టీడీపీ కోరుతోంది. ఉదయం 8 గంటలకు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభకు వెళ్లనున్నారు. 15 రోజుల సభ నిర్వహణపై బీఏసీలో గట్టిగా డిమాండ్ చేయాలని టీడీపీ భావిస్తోంది. ఒక్క రోజు మాత్రమే సభ నిర్వహిస్తే నిరసనగా బాయ్ కాట్ చేసే ఆలోచనలో టీడీపీ ఉంది. రేపటి బీఏసీ నిర్ణయాల ఆధారంగా తమ నిర్ణయం ఉంటుందని టీడీపీ చెప్తోంది.
