ఎల్లుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఆమోదానికి 14 ఆర్డినెన్స్‌లు..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధం అయ్యింది.. ఎల్లుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కీలక ఆర్డినెన్స్‌లపై ఫోకస్‌ పెట్టింది సర్కార్.. అసెంబ్లీ ఆమోదానికి కీలక ఆర్డినెన్సులు తీసుకురానున్నారు. ఈ ఏడాది జులై నుంచి ఇప్పటి వరకు వివిధ శాఖలకు సంబంధించి 14 ఆర్డినెన్సులను జారీ చేసింది ప్రభుత్వం.. ఒకే రోజున 14 ఆర్డినెన్సులను శాసనసభ, శాసన మండలి ఆమోదించేలా ప్రభుత్వం ప్లాన్‌ చేస్తోంది..

ఆమోదానికి రానున్న ఆర్డినెన్స్‌లు: ఏపీ శాసనసభ శీతాకాల సమావేశాల్లో ఆమోదానికి రానున్న ఆర్డినెన్స్‌ల విషయానికి వస్తే..

 • ఏపీ అగ్రికల్చర్‌ ల్యాండ్‌ చట్ట సవరణ
 • ఏపీ రైట్స్‌ ఇన్ ల్యాండ్‌ అండ్‌ పట్టాదారు పాస్‌బుక్స్‌ చట్ట సవరణ
 • ఏపీ పంచాయతీ రాజ్‌ చట్ట సవరణ.
 • ఏపీ ప్రైవేట్‌ యూనివర్సిటీల చట్ట సవరణ.
 • ఏపీ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులెటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ చట్ట సవరణ.
 • ఏపీ విద్యా చట్ట సవరణ.
 • ఏపీ ఛారిటబుల్‌ అండ్‌ హిందూ రిలిజియస్‌ ఇన్సిటిట్యూషన్స్‌ అండ్‌ ఎండోమెంట్స్‌ చట్ట సవరణ.
 • ఏపీ ఛారిటబుల్‌ అండ్‌ హిందూ రిలిజియస్‌ ఇన్సిటిట్యూషన్స్‌ అండ్‌ ఎండోమెంట్స్‌ చట్ట రెండో సవరణ.
 • ఏపీ రెగ్యులేషన్‌ ఆఫ్‌ ట్రేడ్‌ ఇన్‌ ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌, ఫారిన్‌ లిక్కర్‌ చట్ట సవరణ.
 • ఏపీ అసైన్డ్‌ ల్యాండ్‌ చట్ట సవరణ.
 • ఏపీ బొవైన్‌ బ్రీడింగ్‌ చట్ట సవరణ.
 • ఏపీ సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్స్‌ కో-కంట్రిబ్యూటరీ పెన్షన్‌ చట్ట సవరణ.
 • ఏపీ మున్సిపల్‌ కార్పోరేషన్ల చట్ట సవరణ.
 • ఏపీ సినిమా నియంత్రణ చట్ట సవరణ.

Related Articles

Latest Articles