వాడివేడిగా సాగుతున్న ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఇవాళ సభలో 9 బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుకు సంబంధించిన బిల్లును సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. సభ ముందుకు రానుంది సీఆర్డీయే చట్ట సవరణ బిల్లు. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి కాగ్ నివేదికను సభ ముందు ఉంచనుంది ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. వ్యవసాయం, అనుబంధ రంగాలపై సభలో స్వల్పకాలిక చర్చ జరుగుతుంది.
Read Also: Vizag Smart Scam Update: విశాఖ స్మార్ట్ యోజన కేసులో సీఐడీ దూకుడు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 15వ తేదీ గురువారం నుంచి ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. సభలో చర్చ జరగకుండా అడ్డుపడిన టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేస్తూనే వున్నారు. సమావేశాలు ప్రారంభం నుంచి టీడీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టిస్తూనే వున్నారు. గొడవ చేయడం ద్వారా త్వరగా సస్పెండ్ అయి బయటకు వెళ్లిపోవాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభలో మంగళవారం కూడా హంగామా చేశారు.
దీనిపై శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఉదయం నుంచి టీడీపీ సభ్యుల ప్రవర్తన అలాగే వుందని, ప్రీ ప్లాన్డ్ గా సభనుంచి బయటకు వెళ్లాలని వారు భావిస్తున్నారన్నారు. మధ్యాహ్నం పెగాసస్ వ్యవహారంపై మధ్యంతర నివేదికను హౌస్ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రవేశపెట్టినప్పుడు కూడా సేమ్ సీన్. దీంతో టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని. ఇవాళ చివరిరోజయినా సభ సజావుగా సాగుతుందని భావిస్తున్నారు. అటు శాసనమండలి సమావేశాలు కూడా ఇవాళ్టితో ముగుస్తాయి.
Read Also: Rajasthan Congress: రాజస్థాన్ కాంగ్రెస్‌లో లుకలుకలు.. సీఎం పదవిని కాపాడుకునే ప్రయత్నంలో గెహ్లాట్