Vizag Smart Scam Update: విశాఖ స్మార్ట్ యోజన కేసులో సీఐడీ దూకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో సంచలనం కలిగించిన విశాఖ స్మార్ట్ యోజన వెల్ఫేర్ ఘరానా మోసం కేసులో దర్యాప్తు వేగవంతం చేసింది CID….ఈ కేసుకి సంబంధించి ఇద్దరు కీలక నిందితులను విచారణ కోసం కస్టడీ పిటీషన్ దాఖలు చేసింది సీఐడీ. నేడు కోర్టు నుంచి అనుమతి లభించే అవకాశం ఉంది. స్మార్ట్ యోజన వెల్ఫర్ సొసైటీ ముసుగులో వందల కోట్లు కొట్టేశారు నిందితులు. ఎండీ సుధాకర్ ను ఇప్పటికే కస్టడీలోకి తీసుకుని విచారించింది సీఐడీ. భారీ స్కామ్ నిందితుడు సుధాకర్ పేరు మీద ఒక ఇల్లు,10లక్షల బ్యాంక్ బాలెన్స్ మాత్రమే ఉన్నట్టు సమాచారం.
నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేయడం కోసందళారులను పెట్టుకున్నాడు సుధాకర్. 15మందిని గుర్తించి నోటీసులు జారీ చేసింది CID. నిరుద్యోగుల బలహీనతే పెట్టుబడిగా జరిగిన ఘరానా దోపిడీ ఇది. భారీ జీతాలు….ఉన్నతమైన ఉద్యోగాలు పేరుతో వల వేసి చేసిన పక్కా మోసానికి తెరతీశారు. స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ అవకతవకల తీగలాగితే ఇప్పుడు డొంకంతా కదులుతోంది. ఫర్మ్ పేరులో స్మార్ట్ ఉంచుకుని….రాజకీయ పెద్దలతో పరిచయాలు పెంచుకున్న వ్యక్తి అంతరంగం పసిగట్టలేకపోయారు నిరుద్యోగులు. స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ సీఎండీ ఇండిపూడి సుధాకర్ ను అనకాపల్లిలో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also Read
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
Read Also: Elevator Accident : ఖమ్మంలో దారుణం.. లిఫ్ట్ రాకముందే డోర్ ఓపెన్ చేయడంతో..
అనకాపల్లికి చెందిన ఇండిపూడి సుధాకర్ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. 2018 అక్టోబర్ లో నర్సీపట్నం కేంద్రంగా స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీని స్ధాపించాడు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా తమ సంస్ధ పనిచేస్తున్నట్టు ప్రకటించుకున్నాడు సుధాకర్. గ్రామాలు, స్కూళ్లలో సోషల్ వర్క్ చేస్తూ జనానికి దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరిజిల్లాలకు కార్యకలాపాలు విస్తరించాయి. భారీగా ఉద్యోగాల భర్తీ, ఆకర్షణీయమైన జీతాలు ప్రకటించి నిరుద్యోగ యువతకు ఆఫర్ ఇచ్చాడు సుధాకర్. ఇతని మోసాలను విద్యావంతులు కూడా పసిగట్టలేకపోయారు.
స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ పుట్టిన నర్సీపట్నంలోనే ఆ సంస్ధ ఎండీ సుధాకర్ పై ఫిర్యాదులు వచ్చాయి. సంస్ధలో ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, జిల్లా ఏవో పోస్టులు వున్నాయని, నెలకు 15నుంచి 25వేలు జీతంగా చెల్లిస్తామని నమ్మబలికింది. ఇందు కోసం డిపాజిట్ రూపంలో ఒక్కొక్కరి దగ్గర నుంచి 1.5లక్షల నుంచి మూడు లక్షల వరకు వసూలు చేశాడు. నకిలీ నియామకపత్రాలతో బురిడీ కొట్టించాడు. ఇంతకీ ఈ సుధాకర్ వెనుక వున్నది ఎవరు? అతని అకౌంట్లో పదిలక్షలే వుండడం ఏంటి? వసూలు చేసిన కోట్లు ఎవరి అకౌంట్లలోకి చేరాయి? అసలు ఈ వ్యవహారంలో పెద్ద తలకాయ ఎవరు? ఇప్పుడివే ప్రశ్నలు అందరి మెదళ్ళను తొలిచేస్తున్నాయి.
Read Also: PM Narendra Modi: ప్రధాని వ్యాఖ్యలకు మద్దతు తెలిపిన యూఎస్ఏ, ఫ్రాన్స్.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..