NTV Telugu Site icon

Young Man Died While Dancing In Wedding: ప్రాణాలు తీస్తోన్న డీజేలు.. పెళ్లి వేడుకలో డ్యాన్స్‌ చేస్తూ మరో యువకుడు మృతి

Dj

Dj

Young Man Died While Dancing In Wedding: ఈ మధ్య చిన్న, పెద్ద తేడా లేకుండా గుండెలు ఆగుతున్నాయి.. వయస్సుతో సంబంధం లేకుండా ఎంతో మంది ప్రాణాలువదులుతున్నారు.. నడుస్తూ కొందరు, ఎక్సర్‌సైజ్‌ చేస్తూ మరొకొందరు.. ఏదో ఒక పని చేస్తూ ఇంకా కొందరు.. ఇలా ఎంతో మంది ప్రాణాలు పోయాయి.. అంతేకాదు.. హుషారుగా డ్యాన్స్‌లు వేస్తూ కుప్పకూలిన యువకులు, మహిళలు కూడా ఉన్నారు.. పెళ్లి వేడుకల్లో, బరాత్‌లో.. డీజేల సౌండ్స్‌ మధ్య స్టెప్పులేస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లినవారి సంఖ్య ఈ మధ్య పెరుగుతూనే ఉంది.. తాజాగా, చెన్నైలో జరిగిన ఓ పెళ్లి వేడుకల్లో విషాద ఘటన చోటు చేసుకుంది.. డీజీ సౌండ్స్‌కు డ్యాన్స్‌లు వేస్తూ ఏపీకి చెందిన యువకుడు కుప్పకూలిపోయాడు.

Read Also: Tirumala: శ్రీవారి కొండకు కాలినడకన వచ్చే భక్తులకు గుడ్ న్యూస్

చెన్నైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ పెళ్లి పెళ్లి వేడుకల్లో డీజే సాంగ్ కి హుషారుగా స్టెప్పులు వేశాడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు.. కర్నూలు జిల్లాకు చెందిన సత్య సాయి.. శ్రీపెరంబదూర్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నాడు. అయితే, ఫ్రెండ్‌ మ్యారేజ్ కావడంతో.. తన స్నేహితులతో కలిసి వెళ్లాడు.. ఇక, పెళ్లి వేడుకల్లో హుషారుగా గడిపాడు.. డీజే పాటలకు తోటి స్నేహితులతో కలిసి స్టెప్పులు వేశాడు.. ఇంత వరకు బాగానే ఉన్నా.. కొద్దిసేపు డ్యాన్స్‌ చేసిన తర్వాత.. ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు.. షాక్‌ తిన్న స్నేహితులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.. అయితే, అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. పెళ్లి వేడుకలో డీజే సౌండ్స్‌ ఓ ఫ్యాషన్‌ కావొచ్చు.. ఇప్పుడు ప్రాణాలు తీస్తున్న వాటి జోలికి వెళ్లకపోవడం బెటర్‌ అంటున్నారు వైద్య నిపుణులు.

Show comments