NTV Telugu Site icon

ఆనంద‌య్య క‌రోనా మందు.. హైకోర్టులో మ‌రో పిటిష‌న్‌

High Court

కృష్ణ‌ప‌ట్నం ఆనంద‌య్య క‌రోనా మందు కోసం న్యాయ‌పోరాటానికే దిగేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది.. ఇప్ప‌టికే ఆనంద‌య్యకు వ్య‌తిరేకంగా కొంత‌.. అనుకూలంగా చాలా వ‌ర‌కు సోష‌ల్ మీడియాలో మ‌ద్ద‌తు ల‌భిస్తుండ‌గా.. వెంట‌నే ఆనంద‌య్య త‌యారు చేసిన క‌రోనా మందు పంపిణీ చేయాలంటూ.. అనంత‌పురానికి చెందిన ఓ వ్య‌క్తి హైకోర్టును ఆశ్ర‌యించారు.. మ‌రోవైపు.. ఆ మందు పంపిణీపై హైకోర్టులో మరో హౌస్ మోషన్ పిటిష‌న్ దాఖ‌లైంది.. క‌రోనా బాధితుల‌కు వెంటనే మందు పంపిణీ జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిష‌న్ పేర్కొన్నాడు.. మందు పంపిణీకి అయ్యే ఖ‌ర్చులు, ఇతర సౌకర్యాలు ప్ర‌భుత్వ‌మే కల్పించాలన్న పిటిషనర్.. శాంతి భద్రతల సమస్య లేకుండా చూడాల‌న్నారు.. లోకాయుక్తా ఆదేశాల ప్రకారం మందు పంపిణీ అపారని.. అస‌లు లోకాయుక్తకి ఆ అధికారం లేదని త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఇక‌, మందు పంపిణీ ఆదేశాలు లోకాయుక్త ఇవ్వ‌లేద‌ని.. ఏ ఆదేశాలు లేకుండా ఆపటం సరికాద‌ని.. ఆర్డర్ ఇవ్వకుండా మందు పంపిణీ ఆపటం వల్ల ప్రాణాలు పోయే పరిస్థితి వ‌చ్చింద‌న్నారు. మ‌రి రెండు హౌస్ మోష‌న్ పిటిష‌న్ల‌పై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. మ‌రోవైపు.. ఇప్ప‌టికే ఆనంద‌య్య క‌రోనా మందుపై ఆయుష్ క‌మిష‌న‌ర్ రాములు.. త‌న నివేదిక‌ను ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు అంద‌జేసిన సంగ‌తి తెలిసిందే.