NTV Telugu Site icon

Posani Krishna Murali: విచారణకు సహకరించని పోసాని..

Posani

Posani

Posani Krishna Murali: అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో లో సినీ నటుడు పోసాని కృష్ణ మురళి విచారణ కొనసాగుతుంది. దాదాపుగా ఐదు గంటల పాటు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, సీఐ వెంకటేశ్వర్లు విచారిస్తున్నారు. అయితే, విచారణకు నటుడు పోసాని కృష్ణ మురళి సహకరించడం లేదు.. ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం చెప్పకుండా మౌనంగా కూర్చున్నారు.. ఆయన నోరు విప్పితేనే విచారణ కొనసాగుతుంది అన్నారు.. అలాగే, తాము అడిగిన ప్రశ్నలకు పోసాని తికమక సమాధానం చెబుతూ.. తెలియదు, మర్చిపోయా, గుర్తుకులేదు అంటూ సమాధానమిస్తున్నాడు అని ఓబులవారి పల్లి పోలీసుల వెల్లడించారు.

Read Also: IND vs NZ: న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో అతనికి అవకాశం ఇవ్వాలి..- కైఫ్

ఇక, ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ కు రైల్వే కోడూరు కోర్టు పీపీ భ్రమరాంబ, ప్రభుత్వ తరపు న్యాయవాదులను అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పిలిపించారు. అలాగే, పోసాని కృష్ణ మురళి తరఫున వాదించడానికి రైల్వే కోడూరు న్యాయస్థానానికి సీనియర్ న్యాయవాది, మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సైతం వచ్చారు. పోసాని తరుపున బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.