Site icon NTV Telugu

MLA Peddireddy Dwarakanath Reddy: ఎమ్మెల్యే పెద్దిరెడ్డిపై కేసు నమోదు..

Mla Peddireddy Dwarakanath

Mla Peddireddy Dwarakanath

MLA Peddireddy Dwarakanath Reddy: కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించింది.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. సీఎం చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచాడని ఆరోపిస్తూ.. వైసీపీ ‘వెన్నుపోటు దినం’ పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహించగా.. తంబళ్లపల్లె ఎమ్మెల్యే కూడా భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.. అయితే, ఈ నేపథ్యంలో పలువురు నేతలపై కేసులు నమోదు అవుతున్నాయి.. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పై తాజాగా కేసు నమోదు చేశారు పోలీసులు.. వైసీపీ అధిష్టానం పిలుపుమేరకు వెన్నుపోటు దినం పేరిట పార్టీ శ్రేణులతో కలిసి మొలకలచెరువులో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి.. 300 మందితో ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారు మొలకలచెరువు పోలీసులు. కానీ, ఈ నిబంధనలను ఉల్లంగించడంతోపాటు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించారని కేసులు పెట్టారు పోలీసుల.. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌ రెడ్డితో పాటు మరో పదిమందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు మొలకలచెరువు పోలీసులు.

Read Also: Shubman Gill: ఆటగాళ్ల కెప్టెన్‌గా ఉంటా.. ప్రత్యేకమైన శైలి అంటూ ఏమీ లేదు!

Exit mobile version