Minister Ramprasad Reddy: కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.. అయితే, దీనిపై స్పందించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. హాట్ కామెంట్స్ చేశారు.. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి లాగా ఎన్నికలు జరగకుండా రౌడీయిజం, పోలీస్ ఇజంతో రాష్ట్రంలోని స్థానిక సంస్థలన్నీ అస్తగతం చేసుకున్నారు.. కానీ, మా ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అయింది.. మేం ఎక్కడ కూడా ఏ మున్సిపల్ చైర్మన్, జడ్పీ చైర్మన్, ఎంపీపీని దించేందుకు మా నాయకత్వం కానీ, మేము కానీ ముందుకు రాలేదన్నారు.. ఉమ్మడి కడప జిల్లాలో జడ్పీ చైర్మన్ దక్కించుకున్నామంటూ వైసీపీ వారు కేకులు కోసుకోవడం, దండలు వేసుకోవడం వంటివి చేస్తూ హడావిడి చేస్తున్నారు.. ఉమ్మడి కడప జిల్లాలోని 50 జడ్పీటీసీలు రాజీనామాలు చేసి ఈరోజు ఎన్నికలకు వస్తే ఎవరు గెలుస్తారో తెలుస్తుందంటూ.. వైసీపీ నేతలకు సవాల్ విసిరారు..
Read Also: Deputy CM Pawan Kalyan: పిఠాపురంపై పవన్ కల్యాణ్ రివ్యూ.. కీలక సూచనలు
వైసీపీ వాళ్లు వాళ్ల కుర్చీల కోసం వాళ్లే కొట్లాడుకొని తెలుగుదేశంపై మేం యుద్ధం చేసి జడ్పీ చైర్మన్ ను కైవసం చేసుకున్నామంటూ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా చేశారు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి.. రాబోయే ఒకటిన్నర సంవత్సరంలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి… ఆ రోజు రాష్ట్రంలో 92 స్ట్రైక్ రైట్స్ తో అన్ని స్థానాల్లో కూటమి ప్రభుత్వం పోటీ చేస్తుంది.. గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు.. కూటమి ప్రభుత్వంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎలా గెలిచారో ఆ విధంగా స్థానిక సంస్థలలో కూటమి అభ్యర్థులు కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తారనే నమ్మకాన్ని వెలిబుచ్చారు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.