NTV Telugu Site icon

B. C. Janardhan Reddy: గత ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేశారు..

B. C. Janardhan Reddy

B. C. Janardhan Reddy

గత ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేశారని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేశారని అన్నారు. సొంత జిల్లాను మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏ విధంగా అభివృద్ధి చేశాడో చూస్తుంటే కనిపిస్తుందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకున్నారు.. ఎలాంటి అభివృద్ధి చేశారో ఇక్కడ చూస్తుంటే కనపడుతుందని పేర్కొన్నారు. కడప జిల్లా ప్రజలు ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డికి ఎన్నో సీట్లు ఇచ్చారు.. కానీ సొంత జిల్లా కడపను అభివృద్ధి చేయలేదని ప్రజలు గుర్తించి ఎన్డీఏ కూటమికి అవకాశం ఇచ్చారని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తెలిపారు.

Read Also: Rohit Sharma: భారత్‌ ఘోర పరాజయం.. స్పందించిన కెప్టెన్ రోహిత్

రెవెన్యూ వ్యవస్థను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నుల్లో సర్వనాశనం చేసి దోపిడీకి పాల్పడ్డారు.. గత వైయస్సార్ ప్రభుత్వం ఏమి చేసిందయ్యా గొప్పగా అభివృద్ధి అంటే.. లిక్కర్ మాఫియా, సాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా ఇలా చెప్పుకుంటూ పోతే ఏ పేర్లు పెట్టినా ఆ కుటుంబానికి చెల్లుతుందని తీవ్ర విమర్శలు గుప్పించారు. పైన ముఖ్యమంత్రి, కింద మంత్రులు కలిసి దోపిడీ చేశారు.. గత ఐదు సంవత్సరాలలో ప్రజలను, పరిపాలనను గాలికి వదిలేసారని మంత్రి ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి.. ఫ్రీ హోల్డ్ భూములపై విచారణ చేయిస్తున్నాం.. మదనపల్లి సబ్ కలెక్టర్ దగ్ధం కేసులో ఎవరున్నారో వారిని బయటికి తీసుకొస్తామన్నారు. ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడికి దక్కని స్థానం జగన్ కు దక్కింది.. దేశ చరిత్రలోనే గొప్ప స్థానం దక్కిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మంత్రి విమర్శలు గుప్పించారు.

Read Also: Chardham Yatra 2024: చార్‌ధామ్ యాత్ర.. 6 నెలల్లో 53 మంది భక్తులు మృతి

Show comments