NTV Telugu Site icon

Gadikota Srikanth Reddy: దావోస్ పర్యటనతో రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్ట్ అయినా వచ్చిందా..?

Gadikota

Gadikota

సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన పై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దావోస్ పర్యటనతో రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్ట్ అయినా వచ్చిందా..? అని ప్రశ్నించారు. దావోస్ పర్యటనతో అద్భుతాలు సాధిస్తాం, ఎన్నోన్నో తెస్తామంటూ చంద్రబాబు గొప్పలు చెప్తున్నారు.. చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటారే కానీ కొత్తగా రాష్ట్రానికి ఏమి తీసుకురాలేరని విమర్శించారు. 2018 పర్యటనలో రాష్ట్రానికి 150 సంస్థలు ఎయిర్ బస్, ఆంధ్రాకు అలీ బాబా, ప్రకాశం జిల్లాకు జిందాల్, రక్షణ పరికరాల ప్లాంట్ లాక్ హీడ్, హై స్పీడ్ రైళ్ల కర్మాగారం, హైబ్రిడ్ క్లౌడ్ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం వంటివి వస్తాయని చెప్పారు.. అప్పటి నుంచి నేటి వరకు రాష్ట్రానికి ఇంకా వస్తూనే ఉన్నాయా..? అని విమర్శించారు.

Read Also: Maharashtra: బడ్జెట్ సమావేశాలకు ముందు ఉద్ధవ్ థాక్రే‌కు భారీ షాక్..! మహాయుతిలోకి పలువురు ఎంపీలు!

రాష్ట్రం నుంచి వెళ్లిన పారిశ్రామిక వేత్తలతోనే అక్కడ ఫోటోలు దిగి మభ్యపెడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. పబ్లిసిటీ కోసం ఎన్‌డి టివి, సిఎన్ బిసి ఛానల్స్‌కు రూ.2.50 కోట్ల ప్రజాధనాన్ని ఇచ్చారన్నారు. ఎంఓయులు ఒకటన్నా అమలు అయ్యాయా..? అని ప్రశ్నించారు. ఇంకా ఎంత కాలం ప్రజలను మభ్యపెడతారు.. ఆంధ్రాలో 10 పోర్టులు ఉన్నాయని చంద్రబాబు చెబుతున్నారు.. మీ హయాంలో ఒక్క పోర్ట్‌ను అయినా కట్టారా? అని అడిగారు. వైఎస్ఆర్ హయాంలో రెండు, మిగిలినవి జగన్ హయాంలో నిర్మాణాలు చేపట్టారని పేర్కొన్నారు. జగన్ హయంలో 17 మెడికల్ కళాశాలలను తీసుకొచ్చారని తెలిపారు. మెడికల్ కళాశాలలు వద్దంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖలు రాయడం అన్యాయం.. రాయలసీమ ప్రజల మనోభావాలను దెబ్బతీయొద్దని గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

Read Also: Oscars 2025 Nominations: ఆస్కార్‌ నామినేషన్స్‌ 2025 ప్రకటన.. పూర్తి జాబితా ఇదే..