Physical harassment: అన్నమయ్య జిల్లాలో మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు బస్సులో ప్రయాణిస్తున్న యువతులను వేధించిన ఘటన సంచలనం రేపింది. మొటుకుపల్లి నుంచి మదనపల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే, వివరాల్లోకి వెళితే.. నలుగురు యువకులు బస్సులో ప్రయాణిస్తుండగా మద్యం మత్తులో యువతులను లైంగికంగా వేధించారు. ఈ విషయాన్ని గమనించిన బస్సు కండక్టర్ శ్రీరాములు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన భరత్, రాజేష్, భాను ప్రకాష్‌తో పాటు మరో వ్యక్తి కండక్టర్‌పై దాడి చేశారు.
Read Also: Operation Deepavali: హెచ్చరిక జారీ చేసిన పోలీసులు, క్షేత్రస్థాయిలో డీఎస్పీ స్థాయి అధికారుల తనిఖీలు
ఇక, గొడవను ఆపేందుకు మధ్యలోకి వెళ్లిన బస్సు డ్రైవర్‌పైనా వారు దాడి చేసినట్లు తెలుస్తుంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కండక్టర్ శ్రీరాములు.. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. ఇక, తాలూకా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నలుగురు యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు బస్సులోని సీసీ కెమెరా ఫుటేజ్‌ను సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
