Illegal Liquor: అన్నమయ్య జిల్లాలో వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం కేసులో కీలక ఆధారంగా లిక్కర్ డైరీ మారింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో, డైరీని పోలీసులు గుర్తించారు. అయితే, నకిలీ మద్యం తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన దాడుల సమయంలో ఈ డైరీ దొరికనట్లు సమాచారం. డైరీలో నకిలీ మద్యం కొనుగోలు చేసిన బెల్ట్ షాపుల నిర్వాహకుల పేర్లు నమోదు ఉన్నట్లు తెలిసింది. ఇందులో సుమారు 78 మంది పేర్లు ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలియజేశారు.
Read Also: Roshan : రోషన్ నెక్ట్స్ మూవీ ఫిక్స్.. ‘హిట్’ డైరెక్టర్‌తో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్!
అయితే, ఈ నకిలీ మద్యం కేసులో కొందరు ప్రముఖులు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, డైరీలో ఉన్న వ్యక్తులు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా జరిపిన లావాదేవీల వివరాలను ఎక్సైజ్ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. బీ. కొత్తకోటకు చెందిన మద్యం దుకాణ నిర్వాహకుడు, కురబల కోట మండలంలో మద్యం దుకాణం నిర్వహిస్తున్న మాజీ ప్రజా ప్రతినిధుల పేర్లు కూడా డైరీలో ఉన్నట్లు తేలింది.