Site icon NTV Telugu

RK Roja: తిరుమల టు శ్రీశైలం పాదయాత్ర.. జగనన్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం..

Rk Roja

Rk Roja

సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు దేశంలో ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు మంత్రి ఆర్కే రోజా.. ప్రభుత్వ విప్ చిర్ల జగ్గి రెడ్డి, మల్లిడి ప్రసాద్ రెడ్డి అభిమాని కోత్త పేట నియోజక వర్గం నుంచి మూడు సార్లు తిరుమలకుకు పాదయాత్రగా వచ్చారు. కన్నుమూసిన ప్రసాద్ రెడ్డి ఆకాంక్ష నెరవేర్చడానికి తిరుమల నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర చేపట్ఆరు.. తిరుమల నుంచి 370 కిలోమీటర్ల మేర శ్రీశైలం పాదయాత్ర కొనసాగుతోంది. 30 ఏళ్ల పాటు సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన రాష్ట్రంలో కొనసాగాలని వారి ఆకాక్షింగా ఉంది.. ఇక, చిర్ల జగ్గి రెడ్డి పాదయాత్రకు సంఘీభావంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యే బియ్యపు మధు సూదన్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, ఎంపీ గురు మూర్తి పాల్గొన్నారు.. పాదయాత్రను ప్రారంభించిన మంత్రి రోజా, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అలిపిరి వరకు పాదయాత్రలో పాల్గొన్నారు..

Read Also: Nadendla Manohar: ప్రజలు కొత్త నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు.. పొత్తులపై అప్పుడే నిర్ణయం..!

ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. మల్లిడి ప్రసాద్ రెడ్డి అనుకోని విధంగా పాదయాత్ర తిరుమలకు చేరుకుని అకాల మరణం పొందడం బాధాకరం అన్నారు.. వారి కల నెరవెరలని శ్రీశైలం వరకు పాదయాత్ర కొనసాగించాలని విప్ జగ్గిరెడ్డి అన్న కొనసాగిస్తున్నారు వారికి అభినందనలు తెలిపిన ఆయన.. సీఎం జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు దేశంలో ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఇక, డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ.. మల్లిడి ప్రసాద్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాక్షించారు.. కాపులు కొత్త పేట నియోజక వర్గంలో కొండత అండగా నిలుస్తున్నారని తెలిపారు. మరోవైపు ప్రభుత్వ విప్‌ చిర్ల జగ్గి రెడ్డి మాట్లాడుతూ.. మల్లిడి ప్రసాద్ రెడ్డి అభిమాని కోత్త పేట నియోజక వర్గం నుంచి మూడు సార్లు తిరుమలకు పాదయాత్రగా వచ్చారు.. అనుకోని విధంగా ప్రసాద్ రెడ్డి మరణించారు, ఆయన ఆకాంక్ష నెరవేర్చడానికి తిరుమల నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర చేపడుతున్నాం అన్నారు.. తిరుమల నుంచి 370 కిలోమీటర్ల మేర మేర శ్రీశైలం వరకు పాదయాత్ర కొనసాగుతోందన్నారు. ఇక, 30 ఏళ్ల పాటు సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన రాష్ట్రంలో కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు ప్రభుత్వ విప్‌ చిర్ల జగ్గి రెడ్డి .

Exit mobile version