మహిళల రక్షణ కోసం ఎన్ని రకాల కొత్త చట్టాలను తీసుకొస్తున్న కూడా మహిళల పట్ల అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో దారుణం జరిగింది.. ఓ బాలిక ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది..బాలికను వేరే ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనికి అదే ఆటోలో ఉన్న ఓ స్నేహితుడు సహకరించాడు.. బాలిక ఫిర్యాదు చెయ్యడంతో అసలు విషయం బయటకు వచ్చింది..
వివరాల్లోకి వెళితే..ఏపీలోని కృష్ణా జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. గ్రామస్తుడే కదా అని ఆటో ఎక్కితే ఆ డ్రైవర్ బాలికను వేరే ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనికి అదే ఆటోలో ఉన్న ఓ స్నేహితుడు సహకరించాడు. ఈ ఘటనపై బాలిక ఫిర్యాదు చేయడంతో ఇద్దరినీ అరెస్టు చేశారు.. ఇంటికి వెళ్లాలని ఓ బాలిక ఆటో ఎక్కింది..బాలిక గ్రామానికి చెందిన 22 ఏళ్ల కుంపటి చందు అనే డ్రైవర్ తన ఆటోలో తన స్నేహితుడితో కలిసి తన ఊరికు వెళ్తున్నాడు. ఆ ఆటోను బాలిక ఆపింది. తనను ఇంటి వద్ద దిగబెట్టాలని వారిని కోరింది..
అనంతరం బాలికకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లారు..అంతేకాదు డ్రైవర్ చందు మద్యం తాగాడు. అనంతరం బాలికపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఇంటికి వెళ్లిన తరువాత బాధితురాలు తనపై జరిగిన ఘోరాన్ని తల్లికి వివరించింది. దీంతో ఆమె పోలీసులకు ఆశ్రయించింది. కూతురుపై జరిగిన అఘాయిత్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై పోక్స్ చట్టం కింద అరెస్ట్ చేశారు..బాలికకు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..