Site icon NTV Telugu

Andhra Pradesh: జూన్ 10న కలెక్టరేట్ల ముందు ఉపాధ్యాయుల ధర్నాలు

Ap Teachers

Ap Teachers

ఉపాధ్యాయ సర్వీసు నిబంధనల రూపకల్పనలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జూన్ 10న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ధర్నాలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఏపీ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు జీవీ నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాసరావు వెల్లడించారు. అటు రాష్ట్రస్థాయిలో జూన్ 17 నుంచి విజయవాడ ధర్నా చౌక్‌లో రిలే నిరాహార దీక్షలు చేపడతామని తెలిపారు. ఈ మేరకు మంత్రి బొత్స సత్యానారాయణకు 11 డిమాండ్లతో కూడిన లేఖ రాశామన్నారు.

NTR District: చెల్లెలి కోసం ఎడ్లబండిపై హస్తినకు అన్న.. స్పందించిన హెచ్‌ఆర్సీ

హైకోర్టు అనుమతి తీసుకుని జీవో 73, 74 ప్రకారం ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు వెంటనే పదోన్నతులు కల్పించాలని లేఖలో డిమాండ్ చేసినట్లు జీవీ నారాయణరెడ్డి తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారులు ఉప విద్యాశాఖ అధికారులుగా పనిచేస్తున్న బోధనేతర సిబ్బందిని తొలగించి ఆ స్థానంలో సీనియర్ ప్రధానోపాధ్యాయులకు, మండల విద్యాశాఖ అధికారులకు పదోన్నతులు ఇవ్వాలని లేఖలో డిమాండ్ చేశామని పేర్కొన్నారు.

Exit mobile version